Madhavi latha gets Emotional video viral: నటి మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. అదే విధంగా ప్రస్తుతం నటి తనమీద కొంత మంది లేనీ పోనీ ప్రచారం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తొంది. ఇటీవల న్యూ ఇయర్ వేళ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేడీస్ కు మాత్రమే అంటూ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే.. దీనిపై నటిమాధవీలత మాత్రం అక్కడికి వెళ్లొద్దని, రాత్రిపూట ఏవైన జరగరానిది.. జరగొచ్చంటూ కూడా మహిళలకు ముందు జాగ్రత్తలు చెప్పారు. అయితే.. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఫైర్ అయ్యారు.
బోరున ఏడ్చేసిన నటి మాధవి లత
నార్మల్‌గా ఉండటానికి చాలా ట్రై చేశాను.. కానీ నాతో అవట్లేదు అంటూ బోరున ఏడ్చిన నటి మాధవిలత https://t.co/r0bXwqIb0O pic.twitter.com/EAwgATzIYN
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2025
ఆమె ఒక వ్యభిచారణి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఒక పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని మాధవీలత అన్నారు. అంతే కాకుండా.. దీనిపై ఎంతవరకైన పొరాడుతానని.. తనను చంపినకూడా వెనుకాడబోనని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై జేసీ యూటర్న్ తీసుకున్నారు. ఏదో ఆవేశంలో నోరుజారానని కూడా చెప్పుకొచ్చారు. మాధవీలతకు మనస్పూర్తిగా సారీచెబుతున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే..నటి మాధవీలత మళ్లీ ఈ ఘటనపై ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా మగాడిలా పొరాడుతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి సీరియస్ గా ఉందామని ట్రై చేస్తున్నా.. కానీ అవ్వట్లేదన్నారు. తాను.. వుమెన్ కార్డు యూజ్ చేసుకోలేదన్నారు.
Read more: Viral Video: వామ్మో.. శ్రీ శైలంలో పూజారీ ఇంటి ఆవరణలో చిరుత సంచారం.. వీడియో వైరల్..
ధర్మంకోసం, మహిళల భద్రత కోసం మాత్రమే మాట్లాడానని ఎమోషనల్ అయ్యారు. కొంతమంది తనను లేనీ పోనీ మాటలతో ట్రోల్స్ చేస్తున్నారని నటి మాధవీలత ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు మాత్రం నటి మాధవీలతకు అండగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter