coronavirus: సెంచరీకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

'కరోనా వైరస్'.. ఇది ప్రస్తుతం అతి వేగంగా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న మహమ్మారి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO కూడా దీన్ని 'మహమ్మారి'గా  ప్రకటించింది.  ఇప్పటి వరకు 114 దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.

Last Updated : Mar 15, 2020, 12:07 PM IST
coronavirus: సెంచరీకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

'కరోనా వైరస్'.. ఇది ప్రస్తుతం అతి వేగంగా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న మహమ్మారి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO కూడా దీన్ని 'మహమ్మారి'గా  ప్రకటించింది.  ఇప్పటి వరకు 114 దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.  దాదాపు లక్షా 40 వేల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు.  ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మరణం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భయాందోళన నెలకొంది. 

Read Also: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!

మరోవైపు భారత దేశంలోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది.  ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.  దీంతో మరింత భయాందోళన నెలకొంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 93కు చేరుకుంది. దీంతో సెంచరీకి దగ్గరలో వచ్చిన కేసుల తీరుపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.  అటు కరోనా వైరస్ వ్యాప్తిపై ఎవరూ భయాందోళన చెందవద్దు. అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Read Also: డ్రామా జూనియర్స్ ప్రోమో అదుర్స్

మరోవైపు ఇటలీలో చిక్కుకున్న 218 భారతీయులను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. వారందరిని చావ్లాలోని ఇండో టిబెటన్ పోలీస్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దాదాపు 15 రోజులపాటు వారిని వైద్యుల పరిశీలనలో ఉంచి అన్నిరకాల పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాత స్వస్థలాలకు పంపిస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News