'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజ గజా వణికిస్తోంది. ఇప్పటికే 163 దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు నివారణ చర్యలపై దృష్టి పెట్టాయి.
Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్లు ఒకేలా ఉండవు..!!
'కరోనా వైరస్' సోకకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO ప్రమాణాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. చేతులు కడుక్కోవడం.. శుభ్రతను పాటించడం.. మాస్కులు ధరించడం లాంటివి పాటిస్తున్నారు. భారత కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే ఇప్పుడు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన. . గో కరోనా.. గో.. కరోనా.. అంటూ ర్యాలీ నిర్వహించారు. దీంతో నెటిజనులు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.
What did i jst c🤔😬
Cabinet Union Minister Ramdas Athawale Chants "Go Corona Go" slogans in Mumbai.Hope Corona virus undrstds eng. What an idea Sir ji to send Corona Virus out of India. Bt surprise is chinese consulate support slogan🤐 pic.twitter.com/C2W1C5VyeK— देश_पुत्र स्वाभिमानी करदाता सरकार https://www.face (@binodojha999) March 17, 2020
గతంలోనూ బీజేపీ ఎమ్మెల్యే హరిప్రీత్ సుమన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'కరోనా వైరస్'కు చక్కని మందు గోమూత్రం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో గోమూత్రం లీటర్ ధర విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా కరోనా వైరస్ కు కేవలం ప్యారాసిటమాల్ మాత్రం వేస్తే చాలని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజనులు వారిని ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత భయంకరంగా భయపెడుతున్న కరోనా వైరస్ పై బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా వ్యాఖ్యానిస్తారా..? అంటూ మండి పడుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.