'కరోనా వైరస్' ...ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 'లాక్ డౌన్' పాటిస్తున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయవచ్చన్నది ఆలోచన. అందుకే చాలా దేశాలు నిర్బంధంగా 'లాక్ డౌన్' విధించాయి. ఐతే జనం మాత్రం అన్ని దేశాల్లో బయటకు వచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
భారత దేశంలోనూ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా 'లాక్ డౌన్' విధించారు. ఐతే ఎక్కడో ఒక దగ్గర జనం బయట తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలీసులు వారిని ఇళ్లకు వెళ్లమని చెప్పేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. తొలి రోజు పూలు ఇచ్చి ఇంటికి పంపిన పోలీసులు.. రాను రాను కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాఠీలతో తరిమేందుకు కూడా వెనుకాడడం లేదు. అక్కడక్కడ కొంత మంది యువకులపై దాడులు చేసిన ఘటనలు కూడా చూశాం.
'కరోనా'ను ఎదుర్కునేందుకు రూ. 2 కోట్ల సాయం
ఐతే విదేశాల్లో పోలీసులు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును... ఇప్పుడు స్పెయిన్ పోలీసులకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇంట్లో ఉండడం అంటే చాలా మందికి బోర్ కొడుతుంది. దీంతో జనం బయటకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి పోలీసులు వారికి వినోదం అందించాలని నిర్ణయించారు. దీంతో చాలా కాలనీలు తిరిగి వారి కోసం మ్యూజిక్ ప్లే చేస్తూ..డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The Police in Mallorca, Spain making rounds around villages on lock down to do this 😭
To alleviate the anxiety of the people and to keep them entertained ❤ pic.twitter.com/lHZCnKmxgr
— StanceGrounded (@_SJPeace_) March 22, 2020