అమరావతి: కరోనా మహమ్మారితో ఆందోళనతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ప్రేమ జంటకు ఇవేవి అడ్డుకాలేదు. తాను ప్రేమించిన ప్రియుడి కోసం 40 కిలో మీటర్లు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుని దేవాలయంలో ప్రేమ జంట పెళ్లి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇడేపల్లికి చెందిన సాయి, హనుమాన్ జంక్షన్‌కు చెందిన భవానీ ఒక సంవత్సర కాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని తెలిపారని, వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో యువకుడిని పలుమార్లు బెదిరించారని పిర్యదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం
Also Read: ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
లాక్‌డౌన్ కొసాగుతున నేపథ్యంలో తాము కలుసుకోవాటానికి కుదురడం లేదని, దీంతో ఎలాగైనా ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. హనుమాన్ జంక్షన్ నుంచి 40 కిలో మీటర్లు ప్రయాణించి మచిలీపట్నం చేరుకున్నారని, అక్కడ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం తమకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారని, ఇరు కుటుంబాలను పిలిపించి ప్రేమజంటపై దాడి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
లాక్ డౌన్ లో ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం 40 కీ. మీ ల ప్రయాణం..