కరోనా ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ జిల్లాల వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించింది. 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలు అని ఇక్కడ కరోనా ప్రభావం అంతగా లేదని అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలను హాట్‌స్పాట్ ప్రాంతాలుగా గుర్తిస్తున్నారని తెలిసిందే. లాక్డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే
దేశంలో ఇప్పటివరకూ కమ్యూనిటి ట్రాన్స్మిషన్ జరగలేదని, అయితే నాన్ హాట్‌స్పాట్ కేంద్రాల్లోనూ పటిష్ట చర్యలు తీసుకుని వాటిని మరింత సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. హాట్ స్పాట్ జోన్లను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని మూడు రకాల జోన్లుగా విభజించారు. రెండు వారాలపాటు ఒక్క కేసు కూడా నమోదుకాని రెడ్ జోన్‌ను ఆరెంజ్గా ప్రకటిస్తారు. అదే విధంగా 14రోజులపాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్‌గా మారుతుందని అధికారులు తెలిపారు. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
ఏపీలో హాట్ స్పాట్స్, రెడ్ జోన్ జిల్లాలు ఇవే:
మొత్తం 11 జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా గుర్తించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్, కృష్ణా, కడప, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలు హాట్‌స్పాట్ జిల్లాలు. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏప్రిల్ 15వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..