'కరోనా వైరస్'.. విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో మే 3 వరకు అన్ని వ్యవస్థలు లాక్ డౌన్ పరిధిలోనే ఉండనున్నాయి. అత్యవసరం సేవలు తప్ప.. మిగతా అన్ని వ్యాపార, పరిశ్రమల కార్యకలాపాలు మూసే ఉన్నాయి.
అత్యవసర సేవలు అందించే ఆంబులెన్స్ లాంటి వాహనాలు తప్ప ఎలాంటి ప్రయివేట్ వాహనాలు అందుబాటులో లేవు. ఈ సమయంలో నిండు గర్భిణీల పరిస్థితి దారుణంగానే ఉంది. హైదరాబాద్ లో ఓ మహిళ 108 ఆంబులెన్స్ లోనే ప్రసవం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి ఓ ఘటన బెంగళూరులోనూ జరిగింది.
బెంగళూరులో ఓ మహిళ దంత వైద్యశాలలో మగబిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణీ అయినప్పటికీ .. ప్రసవ వేదనతోనే ఆమె ఆస్పత్రి కోసం భర్తతోపాటు 7 కిలోమీటర్లు కాలి నడకనే వెళ్లింది. అంతలో వారికి ఓ ఆస్పత్రి కనిపించింది. అప్పటికే ఆమె అపసోపాలు పడుతూ అక్కడి వరకు చేరుకుంది. కానీ అది దంత వైద్యశాల. ఆ ఆస్పత్రి నడిపిస్తున్న దంత వైద్యురాలు డాక్టర్ రమ్య... ఆమె పరిస్థితి అర్ధం చేసుకుని పురుడు పోసింది.
అంతా బాగానే జరిగింది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే కదలిక లేదు. మృత శిశువు పుట్టిందని అనుకున్ననారు. కానీ కొద్దిసేపు ఆ బిడ్డలో కదలిక తీసుకొచ్చేందుకు డాక్టర్ రమ్య ప్రయత్నించారు. ఆమె ప్రయత్నం ఫలించింది. బిడ్డలో కదలిక రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తల్లీ, బిడ్డను ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించామని డాక్టర్ రమ్య తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
దంత వైద్యశాలలో ప్రసవం