చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వెదురుకుప్పం, కుప్పం, రామకుప్పం, పెనుమారు, గుడిపల్లి, వీకోట, బైరెడ్డిపల్లి, ఐరాల, పుంగనూరు, పూతలపట్టు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా.. ఈ వర్షం ధాటికి పలు మండలాల్లో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం చేకూరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మామిడికాయలు, వరి, కూరగాయ పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పంట చేతికొచ్చే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు వాపోతున్నారు. పెనుమూరు, వెదురుకుప్పం ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also read : Liquor sales : మద్యం ప్రియులకు మళ్లీ నిరాశే
ఇదిలావుంటే, శుక్రవారం తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇంకొన్ని చోట్ల ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఓవైపు వరి పంట కోతకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఇంకొంత మంది రైతుల ఒడ్లు మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఉండగా కురిసిన ఈ వర్షం వారిని ఆందోళనపాలుచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..