కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణఎగవేతదారుల రుణాలను మాఫీ చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో 68 వేల 607 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి 50 బ్యాంకుల్లో రుణ ఎగవేతదారుల రుణాలను రాని బాకీలుగా నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీఐ ద్వారా ఈ నిజం వెలుగులోకి వచ్చింది. ఐతే ఇందులో ఆర్ధిక నేరగాళ్లు గీతాంజలి డైమండ్స్ అధినేత మెహుల్ ఛోక్సీ, లిక్కర్ డాన్ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది.
ఐతే ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 30 వరకు తిరిగి బ్యాంకులకు రాకుండా ఉన్న రుణాలను సాంకేతికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఐతే ఈ రుణాలను తిరిగి రాబడతామని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
@INCIndia and Shri.@RahulGandhi should introspect why they fail to play a constructive role in cleaning up the system. Neither while in power, nor while in the opposition has the @INCIndia shown any commitment or inclination to stop corruption & cronyism.
— Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020
వ్యవస్థను బాగు చేయడంలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పని చేయలేదని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..