పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ఉండాలంటే..?

ప్రాజెక్టు వేగంగా నిర్మించడం వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదని.. ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి ఎక్కువ కాలం పట్టినా.. మంచి నాణ్యత ఉన్న ప్రాజెక్టు నిర్మించారన్న పేరును పొందాలని  రాయపాటి అభిప్రాయపడ్డారు

Last Updated : Dec 2, 2017, 04:39 PM IST
పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ఉండాలంటే..?

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నరసారావుపేట ఎంపీ మరియు టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజే ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ తాను కూడా ఈ ప్రాజెక్టు వేగంగానే పూర్తవ్వాలని కోరుకుంటున్నానని.. అయితే నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని నిబంధనలన్నీ పాటించి ప్రాజెక్టు నిర్మిస్తే.. ఇప్పటి లెక్కల ప్రకారం మరో 5 సంవత్సరాలు పట్టవచ్చని తాను అనుకుంటున్నానని రాయపాటి అన్నారు.

ప్రాజెక్టు వేగంగా నిర్మించడం వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదని.. ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి ఎక్కువ కాలం పట్టినా.. మంచి నాణ్యత ఉన్న ప్రాజెక్టు నిర్మించారన్న పేరును పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టునిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో రాయపాటికి కూడా షేర్లు ఉండడం గమనార్హం. 

Trending News