కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ, జల సంఘం అధికారులతో భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టుకి పనిచేస్తున్న గుత్తేదార్లతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రాజెక్టు వేగంగా నిర్మించడం వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదని.. ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి ఎక్కువ కాలం పట్టినా.. మంచి నాణ్యత ఉన్న ప్రాజెక్టు నిర్మించారన్న పేరును పొందాలని రాయపాటి అభిప్రాయపడ్డారు
ఆంధ్రదేశాన్ని సస్యశ్యామల క్షేత్రంగా మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని.. ఆ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఏర్పడే పలు సమస్యలు పూర్తిగా తీరేవరకు వాయిదా వేయాలని ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యాంను నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఆయితే ఈ డ్యాంకు సంబంధించిన పనులను తక్షణం నిలుపుదల చేయాలంటూ ఏపీ సర్కార్ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాసింది. అసలు ఆ డ్యాం అవసరం ఉందో లేదో తేల్చాలని..ఇందుకు నిపుణులతో కూడిన కమిటీ వేయబోతున్నామని పేర్కొంది. ఈ కమిటీ పోలవరం సందర్శించి అధ్యయనం చేసి నివేదిక అందించిన తర్వాతే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ..అప్పటి వరకు డ్యాం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.