Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం..

 అప్పటివరకు తీవ్ర ఎండలు.. వేడెక్కన వాతారణం నగరంలో ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో

Last Updated : May 16, 2020, 05:35 PM IST
Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్: అప్పటివరకు తీవ్ర ఎండలు.. వేడెక్కన వాతారణం నగరంలో ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా శనివారం Hyderabad నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెహదీపట్నం, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, హిమాయత్ నగర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్ పేట్, పంజాగుట్ట,  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ , సెక్రటేరియట్ ప్రాంతాల్లో వర్షం పడింది. 

Also Read: నకిలీ వార్తలతో తస్మాత్ జాగ్రత్త..

మరోవైపు ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. రాబోవు 12 గంటల్లో వాయుగుండం తూఫానుగా మారే ప్రమాదం ఉందని, దీంతో తెలంగాణలో ఆదివారం పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Also Read: పెళ్లైనా అక్రమ సంబంధం.. ఇంట్లో తెలిసిందని ఆత్మహత్య

 

 

Trending News