'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 4.0 నేటి నుంచి అమలులోకి వచ్చింది. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలతో నేటి నుంచి లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
ఈ లోగా దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఐదు దఫాలుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐతే కేంద్ర సర్కారు తీరుపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా కేంద్ర సర్కారు తీరును ప్రశ్నించారు.
కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ఐతే ఈ కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రజలకు కేవలం 5 కిలోల బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకుందన్నారు. అంతే కాదు రాష్ట్రాలు అప్పు తీసుకునేందుకు కూడా షరతులు విధించిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ఇలాంటి షరతులు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
సంగారెడ్డిలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. కరోనా కష్టాలు కొనసాగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం పేదలను ఆదుకుంటోందని తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ పేదలకు 12 కేజీల బియ్యం, 1500 రూపాయలు పంపిణీ చేశారని తెలిపారు. ఇందుకు 2 వేల 500 కోట్లను 2 విడతలుగా పేదల అకౌంట్లలో జమ చేశారన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..