Telagana: ప్రవేశ పరీక్షల తేదీల విడుదల..

గత రెండు మాసాలుగా కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన వివిధ 

Last Updated : May 23, 2020, 07:43 PM IST
Telagana: ప్రవేశ పరీక్షల తేదీల విడుదల..

హైదరాబాద్: గత రెండు మాసాలుగా కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. కరోనా వైరస్ కేసులు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఇందుకుగాను ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

పరీక్షల తేదీలు..

జులై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్‌

జులై 1న పాలిసెట్‌

జులై 4న ఈసెట్‌

జులై 13న ఐసెట్‌

జులై 15న ఎడ్‌సెట్‌

జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌

జులై 10న లాసెట్‌, లా పీజీసెట్ 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News