Covid-19 drug: 103 రూపాయలకే కరోనా ఔషధం..

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ పరిశోధన చేసింది. ఫవిపిరవిర్‌ను 

Last Updated : Jun 20, 2020, 09:06 PM IST
Covid-19 drug: 103 రూపాయలకే కరోనా ఔషధం..

హైదరాబాద్: భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ పరిశోధన చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని,  దీనిపై మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా, ఫాబిఫ్లూ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియాస్‌ డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది. AP SSC exams: పదో తరగతి విద్యార్థులంతా పాస్

Also Read: మద్యం హోం డెలివరీకి amazon.comకు గ్రీన్‌ సిగ్నల్

ఇదిలాఉండగా దేశంలో త్వరలోనే ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందుకు కేంద్ర సర్కారు సహాయం తీసుకుంటామని గ్లెన్‌మార్క్‌ చైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా స్పష్టం చేశారు. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 ఉంటుందని, వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగానే విక్రయాలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. దీనిని కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మధుమేహ, గుండెజబ్బుగలవారు కూడా వాడవచ్చని సూచించారు. నాలుగు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని, వైరల్‌ లోడ్‌ను ఇది తగ్గిస్తుందని పేర్కొన్నారు. తమ క్లినికల్‌ ట్రయ్‌ల్స్‌లో పాజిటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయని గ్లెన్‌ సల్దన్హా వెల్లడించారు. 2014లో యాంటీ ఫ్లూ డ్రగ్‌గా వాడేందుకు అనుమతి లభించింది.  Also Read: సీఏం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఖరారు..
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News