SBI New Rules To Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎం నియమాలు మారాయి

State Bank Of India: ఎస్‌బీఐ ( SBI ) తన వినియోగదారులు ఏటీఎం ( ATM ) నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అంశంలో కీలక మార్పులు చేసింది. ఒక వేళ మీరు ఎస్‌బీఐ వినియోగదారులు ( SBI Customers ) అయితే ఈ కొత్త రూల్స్ మీరు తెలుసుకుంటే డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు.

Last Updated : Jul 6, 2020, 08:58 PM IST
SBI New Rules To Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎం నియమాలు మారాయి

SBI New Rules To Withdrawal: ఎస్‌బీఐ ( SBI ) తన వినియోగదారులు ఏటీఎం ( ATM ) నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అంశంలో కీలక మార్పులు చేసింది. ఒక వేళ మీరు ఎస్‌బీఐ వినియోగదారులు ( SBI Customers ) అయితే ఈ కొత్త రూల్స్ మీరు తెలుసుకుంటే డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. పైగా ఈకొత్త నియమాల వల్ల మీ ఖాతాలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఎవరైనా మీకు తెలియకుండా మీ డబ్బు ఏటీఎం నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తే వెంటనే మీకు తెలిసిపోతుంది. Also Read : USA: అమెరికాలో విమాన ప్రమాదం: 8 మంది మృతి

రాత్రి 8 తరువాత ఈ నియమాలు వర్తిస్తాయి

ఏటీఎం మోసాలను (ATM Frauds ) దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఏటీఎం ( SBI ATM ) నుంచి విత్ డ్రా చేసుకునే నియమాలు మార్చింది. Zeebiz.Com ప్రకారం ఇప్పటి నుంచి వినియోగదారులు తమ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే వారు ఓటీపి ( OTP ) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఓటీపి లేకుండా వినియోదారులు ( SBI OTP Based ATM Withdrawal) తమ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. Also Read :Sushant Singh Rajput: సుశాంత్ పేరుపై ఒక నక్షత్రం

10 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే..

ఎస్‌బీఐ ( State Bank Of India ) వినియోగదారులు రాత్రి 8గంటల తరువాత ఏటీఎం నుంచి రూ.10 వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ కొత్త నియమం వర్తిస్తుంది. మీరు ఏటీఎంలో మీకు కావాల్సిన నగదు వివరాలు ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపి (One Time Password ) వస్తుంది. ఈ ఓటీపి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ పై వస్తుంది. అందుకే మీరు ఏటీఎం వెళ్తే మీ వెంట మీ మొబైల్  ఉండటం ఇప్పుడు ఏటీఎం వినియోగదారులకు తప్పనిసరి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

 

Trending News