బాలీవుడ్లో బంధుప్రీతి ( Nepotism ) పై ఎన్ని విమర్శలు వస్తున్నా..ఆ పరంపర ఆగడం లేదు. మరో వంశాంకురం సినిమా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్షా ( Bollywood Badshah ), బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద ( Agastya nanda ) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సినిమాతో.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్‌పుత్ ( Sushant singh Rajput ) మరణంతో బంధుప్రీతికి సంబంధించి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నది ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ). కేవలం స్టార్ నటుల వారసత్వాన్నే ప్రోత్సహిస్తున్నారనేది ఈయనపై ఉన్న ఆరోపణ.అయితే ఈ విమర్శలు ఓ వైపు వస్తున్నా..మరో స్టార్ వారసుడిని రంగంలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారు కరణ్ జోహార్. బాలీవుడ్ బాద్షా,బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ( Big B Amitabh Bachan ) మనవడైన అగస్త్యానందను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. Also read: Deepika Padukone: దీపికా పదుకోనే స్లో వాక్ చూశారా.. వైరల్ అవుతోన్న వీడియో
అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించినా ఆశించినంతగా గుర్తింపు సాధించలేకపోయారు.ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతాబచ్చన్ నందా ( Shweta Bachan nanda ) కుమారుడైన అగస్త్యానందను హీరోగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. వయస్సు కేవలం 20 ఏళ్లే అయినా సోషల్ మీడియాలో అగస్త్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. Also read: Apsara Rani: అప్సరా రాణి గ్లామర్ సీక్రెట్ అదే
తన కుమారుడు అగస్త్య బాలీవుడ్ ఎంట్రీ త్వరలో ఉంటుందని అతని తల్లి శ్వేతా నంద గతంలోనే ప్రకటించారు. నెపోటిజమ్‌పై వస్తున్న విమర్శల్లో నిజం ఉన్నా లేకపోయినా..మరో వారసుడు మాత్రం బాలీవుడ్ ఎంట్రీ ( Bollywood Entry ) ఇవ్వబోతున్నాడు. యాక్టింగ్ లో మెళుకువలు, బాడీ షేప్అప్ విషయంలో అగస్త్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. Also read: Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్