AP Corona Positive Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా కేసులు (AP CoronaVirus Cases) 1,20,390కు చేరుకున్నాయి. ఇందులో 2461 కేసులు ఇతర రాష్ట్రాలు, 434 విదేశాల నుంచి వచ్చిన వారిలో కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. Favivir: రూ.59కే కరోనా ట్యాబ్లెట్.. నేటి నుంచి మార్కెట్లోకి
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 55,406 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 63,771 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 65 మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,213కి చేరింది. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే..
#COVIDUpdates: #COVID19 cases in the last 24 hours as on 29/07/2020 till 10 AM #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/4ZoRbbcXS3
— ArogyaAndhra (@ArogyaAndhra) July 29, 2020
తాజాగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,676 మందికి కరోనా సోకగా, అత్యల్పంగా విజయనగరంలో 53 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 29న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్