ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ జార్ఖండ్ లో ఒక కార్యక్రమం జరిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు. గెలిచినవారికి బహుమతి ఇచ్చారు. దీనికి చీఫ్ గెస్ట్ ఒక ఎమ్మెల్యే. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే నాసైమన్ మరాండీ స్వగ్రామం తాల్ పహాడీ లో ముద్దుల పోటీలు జరిగాయి. ఈ పోటీలో పాల్గొన్నవారందరూ ఆదివాసీయులే. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ప్రేక్షకులను అలరించారు. ఎవరైతే ఎక్కువ సేపు ముద్దుపెట్టుకున్నారో వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదివాసీయుల్లో మాడ్రడైజేషన్ పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఇలా ముద్దులు పెట్టుకొని తమ అభిప్రాయాలు తెలియజేయటంవల్ల ప్రేమ చిగురిస్తుందని చెప్పారు. కానీ ఇలాంటి వివాదాస్పద కార్యక్రమానికి ఒక ప్రజాప్రతినిధి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధునికత అంటే ముద్దులు పెట్టుకోవడమేనా? అంటూ ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు మండిపడుతున్నాయి.