సారే జహాసే అచ్ఛా..హిందూ సితా హమారా...మౌలానా అల్లామా ఇక్బాల్ రచించిన సుమధుర గీతం ముంబైలో ప్రవహిస్తోందిప్పుడు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం ( Independence day ) సందర్భంగా కరోనా వారియర్లకు నివాళి ఇచ్చే క్రమంలో భాగంగా గేట్ వే ఆఫ్ ఇండియా ముస్తాబవుతోంది.
పంద్రాగస్టు వేడుకలకు ( August 15 celebrations ) మరో వారం రోజులు మిగిలింది. కరోనా మహమ్మారి ( Corona pandemic ) నేపధ్యంలో సామాజికదూరం పాటిస్తూనే వేడుకలు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. పంద్రాగస్టు అతిధులుగా కరోనా వారియర్ల ( Corona warriors ) ను పిలిచి గౌరవం అందించాలని ఇప్పటికే కేంద్రం పిలుపిచ్చింది. ప్రాణాలు కోల్పోయిన కరోనా వారియర్లకు నివాళి కూడా అర్పించనున్నారు. 73 వ స్వాతంత్ర్యదినోత్సవా ( 73rd Independence day ) న ముంబైలోని ( Mumbai ) గేట్ వే ఆఫ్ ఇండియా ఇందుకు ముస్తాబవుతోంది. పశ్చిమ నావికా దళం దీనికి సమాయత్తమవుతోంది. పశ్చిమ నావికా దళానికి ( Western naval command ) చెందిన నేవల్ సెంట్రల్ బ్యాండ్ కరోనా వారియర్లకు నివాళి అర్పిస్తూ...లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సారే జహాసే అచ్ఛా...హిందూ సితా హమారా అంటూ మౌనాలా అల్లామా ఇక్బాల్ రచించిన గీతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా ( Gate way of india ) సాక్షిగా అత్యంత సుమధురంగా ఆలపిస్తూ...ఓలలాడిస్తూ సాగించిన లైవ్ పెర్ఫార్మెన్స్ కన్నులవిందుగా సాగింది.
#WATCH Mumbai: As part of the celebrations for the upcoming 73rd Independence Day, Western Naval Command today organised a live performance of Naval Central Band as a tribute to #CoronaWarriors at the Gateway of India. pic.twitter.com/D1Ql9K3C6W
— ANI (@ANI) August 8, 2020
Also read: Flight Crash: మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏఏఐ ఏమంటోంది ?