India: కరోనాతో ఒక్కరోజే 1,059 మంది మృతి

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వినాశనం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

Last Updated : Aug 26, 2020, 10:37 AM IST
India: కరోనాతో ఒక్కరోజే 1,059 మంది మృతి

Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వినాశనం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మంగళవారం ( ఆగస్టు 25న ) దేశవ్యాప్తంగా కొత్తగా 67,151 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 1,059 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,34,475కు చేరగా.. మరణాల సంఖ్య 59,449కి పెరిగింది.  Also read: Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ

ప్రస్తుతం దేశంలో 7,07,267 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 24,67,759 మంది బాధితులు కోలుకున్నారు.  ఇదిలాఉంటే.. నిన్న 8,23,992 కరోనా టెస్టులు చేశారు. ఆగస్టు 25 వరకు మొత్తం 3,76,51,512 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల

Trending News