ఒక ఢిల్లీ మెట్రో రైలు టెస్ట్ రన్ చేస్తూ మంగళవారం గోడను ఢీ కొట్టింది. ప్రధాని మోదీ డిసెంబర్ 25న మాగ్నటా లైన్ లో ఉన్న కల్కాజి మందిర్-బొటానికల్ గార్డెన్ కారిడార్ ను ప్రారంభించాలి. అందులో భాగంగా ఆరు రోజుల ముందు ఈ టెస్ట్ రన్ ను ప్రారంభించారు.
ఢిల్లీ మెట్రో యొక్క మాగ్నటా లైన్ నోయిడా మరియు దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
ఢిల్లీ మెట్రో యొక్క కొత్త విభాగం ప్రారంభమయ్యాక, ప్రయాణికులు వైలెట్ రేఖపై ఉన్న కల్కాజీ మందిర్ మెట్రో స్టేషన్ కు నేరుగా ప్రయాణం చేయవచ్చు.
Delhi: Empty metro train on trial run, breaks through boundary at Kalindi Kunj depot. Matter being probed. pic.twitter.com/kiqWn7TCVH
— ANI (@ANI) December 19, 2017
బొటానికల్ గార్డెన్ నుండి జానక్‌పురి వెస్ట్ (38.23 కి.మీ.) వరకు మొత్తం కారిడార్ ప్రారంభమయ్యాక, నోయిడాకు చెందిన ప్రయాణికులు హుజ్ ఖాస్‌లో వద్ద రైలు మారి గురుగావ్ కు వెళ్తారు. ఢిల్లీ సరిహద్దుల వెలుపల బొటానికల్ గార్డెన్ స్టేషన్ మొట్టమొదటి ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్ గా అభివృద్ధి చేయబడింది.