హిమచల్ లో బీజేపీ గెలుపు; సల్మాన్ కుటుంబంలో ఆనందం

సల్మాన్ ఖాన్ కుటుంబానికి  కూడా ఈ ఎన్నికలు సంతోషాన్ని తెచ్చిపెట్టాయట. ఎందుకో ఆశ్చర్యపోతున్నారా?

Last Updated : Dec 20, 2017, 09:15 AM IST
హిమచల్ లో బీజేపీ గెలుపు; సల్మాన్ కుటుంబంలో ఆనందం

ముంబై: భారతీయ జనతా పార్టీ సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు ఈ విజయంతో బాణాసంచా పేలుస్తారు, స్వీట్స్ పంచుతారు. మొత్తానికి సంబరాలను జరుపుకుంటారు. కానీ సల్మాన్ ఖాన్ కుటుంబానికి  కూడా ఈ ఎన్నికలు సంతోషాన్ని తెచ్చిపెట్టాయట. ఎందుకో ఆశ్చర్యపోతున్నారా?

అసలు మ్యాటర్ ఇది.. 

సల్మాన్ ఖాన్ చెల్లెలు (దత్తత) ఆర్పితా ఖాన్, ఆయుష్ ఖాన్ ను హైదరాబాద్ ఫలక్ నూమా ప్యాలెస్ లో పెళ్లి చేసుకుంది గుర్తుందా? ఆయుష్ ఒక ఒక రాజకీయ నాయకుడి కుమారుడు. ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతానికి చెందినవారు. అర్పితా మామ అనిల్ శర్మ బీజేపీ టికెట్ తో మండి  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.  విజయం సాధించిన తర్వాత తన మామ మద్దతుదారులతో కలిసి దిగిన ఫోటోలను అర్పితా ఇస్టాగ్రమ్ లో పోస్టు చేశారు.

"నాన్నగారు.. విజయం సాధించినందుకు అభినందనలు! ఆయనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు మండి ప్రజలందరికీ కృతజ్ఞతలు" అంటూ పోస్టు చేశారు.

 

అనిల్ శర్మ 25,202 ఓట్లతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంపా ఠాకూర్ ను ఓడించారు. ఠాకూర్ 16,701 ఓట్లు మాత్రమే సాధించారు. వీరభద్ర సింగ్ ప్రభుత్వంలో సిట్టింగ్ మంత్రి, మాజీ టెలికం మంత్రి సుఖ్ రామ్ కుమారుడు అనిల్, ఈ ఏడాది అక్టోబరులో బీజేపీలో చేరారు.

అనిల్ శర్మ 2013లో వీరభద్ర సింగ్ కేబినెట్లో చేరారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. శర్మ 1993-97లో రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు. 

Trending News