Swami Agnivesh: అనారోగ్యంతో స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ఆర్య సమాజ్‌ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్‌ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు.

Last Updated : Sep 12, 2020, 04:17 AM IST
Swami Agnivesh: అనారోగ్యంతో స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

Swami Agnivesh passes away: ఢిల్లీ: ఆర్య సమాజ్‌ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్‌ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ ప్రత్యేకంగా భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు. అయితే ఆయన కొద్దిరోజులుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధి (suffering from liver cirrhosis) తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ (ILBS) లో తుదిశ్వాస విడిచారు. ఆయన పరిస్థితి విషమించడంతోనే కన్నుమూసినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. Also read: NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే

స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్ రావ్.. ఆయన 1939 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని శ్రీకాకుళంలో జన్మించారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆయన తాతగారి స్వగ్రామం ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయి.. పలు డిగ్రీలు చేశారు. ఫిలాసఫీ, న్యాయవాద కోర్సులు చదివారు. ఆ తర్వాత ఆయన ఆర్యసమాజ్‌లో చేరారు. అనంతరం స్వామి అగ్నివేశ్ సామాజిక సమస్యలపై పోరాడేందుకు ఆర్యసభ అనే రాజకీయ పార్టీను స్థాపించారు. దీంతోపాటు ఆయన హర్యానా నుంచి ఎమ్మెల్యేగా సైతం గెలిచి సేవలందించారు. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే

దీంతోపాటు స్వామి అగ్నివేశ్ మావోయిస్టులతో చర్చలకు సైతం మధ్యవర్తిత్వం వహించారు. అంతేకాకుండా 2011లో అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో అన్నా హాజరేకు వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమానికి సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించి పలు సభల్లో ఆయన ప్రసంగించారు. Also read : TS ECET counselling schedule: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదిగో

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x