తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 కేసుల సంఖ్య (CoronaVirus cases in Telangana) 1,58,153కి చేరింది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 974కి చేరింది. Rains In Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 1,27,007కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,532 యాక్టివ్ కేసులుండగా.. మరో 23,639 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా నమోదైన కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 264 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డిలో 133, కరీంనగర్లో 108, సంగారెడ్డిలో 107, సిద్ధిపేటలో 75, వరంగల్ అర్బన్ 70 కరోనా కేసులు నమోదు చేశాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. US Open 2020 Winner: యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్.. 71 ఏళ్ల తర్వాత సంచలనం
ఫొటో గ్యాలరీలు
- Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR