అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరికొత్త 'రోబో అవతారం ఎత్తారు..అదేలా సాధ్యమనుకుంటున్నారా ?..ఇది సాధ్యపడింది..నమ్మలేకపోతున్నారా అయితే ఈ వీడియో చూడండి ఎలా సాధ్యపడిందో మీకే అర్థమౌతుంది....
So exciting!!
Disney’s Magic Kingdom has finally opened their doors to the highly anticipated Hall of Presidents — now featuring President Donald Trump! pic.twitter.com/o0m2Xe4M0l
— Corryn 🇺🇸 (@Corrynmb) December 18, 2017
మొదటి నుంచి అమెరికా దేశం.. ప్రజలు నిర్దేశించిన దేశంగా పేరు పొందింది. అమెరికాకు స్వాతంత్రం రావడానికి అమెరికన్లే కృషిచేశారు’ అని రోబో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటోంది.
సృష్టికర్త డిస్నీ వరల్డ్
డిస్నీ వరల్డ్‌లోని మాజిక్ కింగ్‌డమ్ పార్క్‌లో ‘హాల్ ఆఫ్ ప్రెసిడెంట్స్’ పేరిట ప్రతి ఐదేళ్లకు ఒకసారి అమెరికా అధ్యక్షుల రోబోలను తయారుచేస్తుంటారు. ఈ క్రమంలో ఈ సారి యూఎస్ కొత్త అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ రోబోను తయారుచేసిన డిస్నీ ట్విటర్‌లో ఫోటోను విడుదల చేసింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి ఈ రోబోను తయారుచేయాలని డిస్నీ వరల్డ్ నిర్వాహకులు అనుకుంటున్నారట. అయితే వైట్ హౌట్ అపాంట్ మెంట్ దొరక్కపోవడంతో కాస్త ఆలస్యమైంది. పైగా దీని తయారీ కోసం రాత్రిపగలు తెగకష్టపడినట్లు తెలిసింది.
సందర్శకులకు దర్శనం
ట్రంప్ రోబోను తయారు చేసేందుకు కొన్ని నెలల క్రితమే వైట్‌హౌస్ ప్రతినిధులను సంప్రదించి ట్రంప్ కొలతలు తీసుకున్నారు. ఈ పార్క్‌ను వచ్చే వారం సందర్శకుల కోసం తెరవనున్నారు. అయితే ఈ రోబో ట్రంప్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
This is the "Hall of Presidents" version of Trump.
This appears to be Hillary Clinton, redone to look like Trump. pic.twitter.com/sDcvmmz6mN
— Mike (@Fuctupmind) December 20, 2017
రోబో అవతారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడిని చూసి ఇక నుంచి ఆయన Donald Trump ట్రంప్ కాదు.. Robot Trump అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు
Disney’s Hall of Presidents version of President Trump looks suspiciously familiar.... pic.twitter.com/0wdJrbB5vq
— Corryn 🇺🇸 (@Corrynmb) December 20, 2017