మీకు తరచూ తలనొప్పిగా ఉంటోందా..తీవ్రమైన అలసట ఉందా..ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలుంటే మాత్రం అది కచ్చితంగా విటమిన్ బి 12 ( Vitamin B12 Deficiency ) లోపమే. అజాగ్రత్త చేస్తే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. మరి ఈ లోపాన్ని ఎలా సవరించుకోవచ్చో తెలుసా..
మనిషి శరీరంలో అవసరమైన వివిధ విటమిన్లలో ముఖ్యమైంది విటమిన్ బి 12. కోబాలమిన్ ( Cobalamin ) గా కూడా దీన్ని పిలుస్తారు. మనిషి నాడీ వ్యవస్థ ( Human nervous system ) పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే ఎక్కువ సమయం కిచెన్ లో ఉండే కారణంగా తలనొప్పి ( Headache ), తీవ్రమైన అలసట ( Fatigue ) వస్తుంటుంది. విటమిన్ బి 12 లోపంపై అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఊపిరి తిత్తుల సమస్యలైన శ్వాస సరిగ్గా ఆడకపోవడం, మానసిక సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తాయి. మరి ఇంత ముఖ్యమైన విటమిన్ బి 12 మనిషికి ఎక్కడ్నించి వస్తుందో తెలుసా.
విటమిన్ బి 12 అనేది ప్రదానంగా జంతు సంబంధ ఉత్పత్తులు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో లభ్యమవుతుంది. శాకాహారంలో ఈ విటమిన్ ఉండదు. అందుకే శాకాహారుల్లో ఈ విటమిన్ లోపముండేవారు ఎక్కువగా కన్పిస్తుంటారు. ఇలాంటివారు వైద్యుల సూచన మేరకు విటమిన్ బి 12 ట్యాబ్లెట్లు తీసుకోవల్సి ఉంటుంది. Also read: Side Effects of Apple: యాపిల్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే
విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహార పదార్ధాలు ( Vitamin B12 rich in food )
సముద్రపు చేపలైన ( Sea Fish ) సాల్మన్ వంటివి తరచూ తీసుకుంటే దేహానికి అవసరమైన చాలా రకాల పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిబోఫ్లేవిన్, నియాసిస్, థియామిన్, విటమిన బి 6 వంటివి అందుతాయి.
మాంసంలో ( Mutton ) అయితే విటమిన్ బి 12 సమృద్ధిగా ఉంటుంది. అయితే మాంసాన్ని ఎంచుకునేటప్పుడు తక్కువ కొవ్వుశాతం ఉండేది ఎంచుకోవడం మంచిది. మాంసాన్ని బాగా ఉడికించి కూరగా చేసుకుని తింటే మంచిది. దీంతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కావల్సినంత లభిస్తుంది.
గుడ్లు ( Eggs ) వంటి పౌల్ట్రీ ఉత్పత్తుల్లో బి విటమిన్లు, ముఖ్యంగా బి 2, బి 12 లు సమృద్ధిగా లభిస్తాయి. గుడ్డు సొనలో బి 12 అధికంగా ఉంటుంది. అందుకే కేవలం ఎగ్ వైట్నే కాకుండా మొత్తం గుడ్డును ఆహారంగా తీసుకోవాలి.
ఇక ట్రౌట్ చేపలో ( Trout fish ) అయితే విటమిన్ బి 12 చాలా ఎక్కువగా ఉంటుంది. విలువైన పోషకాలతో నిండి ఉండే రెయిన్ బో ట్రౌట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చేప ద్వారా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు శరీరానికి అందుతాయి. రోజూ కనీసం వంద గ్రాముల ట్రౌట్ చేపను తీసుకుంటే..ఏకంగా 7.5 ఎంసీజీల విటమిన్ బి 12 లభిస్తుంది.
ఇవి కాకుండా శాకాహారులైతే మాత్రం తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. తృణధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి 12 స్థాయి పెరుగుతుంది. వివిధ రకాలైన విటమిన్ బి 12 ట్యాబ్లెట్లు ( Vitamin B12 Tablets ) మార్కెట్లో చాలావరకూ అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచన మేరకు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 2.4 ఎంసీజీ పరిమాణంలో విటమిన్ బి 12 శరీరానికి అవసరం. Also read: Health benefits of eggs: రోజూ 2 గుడ్లు తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా ?