అంతటి అందం వెనుక విషం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందంగా ఉంది కదా అని ముద్దు చేద్దామనుకుంటే ప్రాణాలకే ప్రమాదం మరి. వైరల్ అవుతున్న ఈ బ్లూ స్నేక్ ( Blue Snake ) పట్ల తస్మాత్ జాగ్రత్త.
భూమి మీద ఉన్నసమస్త జీవుల్లో కెల్లా భయం కల్గించేది మాత్రం కచ్చితంగా పాము (Snakes )మాత్రమే. కంటికెదురుగానే కాదు..వీడియోల్లో చూసినా ఒళ్లు జలదరిస్తుంటుంది. మరి కంటికెదురుగా కన్పిస్తే పారిపోతాం. కానీ ఇలాంటి పాముల్లో కొన్ని ముద్దొస్తుంటాయి కొందరికి. ఆశ్యర్యంగా ఉందా. నిజమే మరి. వైరల్ అవుతున్న ఈ బ్లూ స్నేక్ వీడియో కాస్త చూడండి మరి. నీలి రంగుతో మెరుస్తూ..ఆకర్షించడమే కాకుండా...అందమైన గులాబీను చుట్టుకుని మరింత అందంగా తయారైనట్టుంది. అలాగని దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టేయవద్దు. లిప్తపాటు కాలంలో కాటు చాలు..సర్రున మీ ప్రాణం పోవడానికి. అంతటి అందం వెనుక అంత విషం కూడా ఉంది.
The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t
— Life on Earth (@planetpng) September 17, 2020
ఎక్కడిదో తెలియదు గానీ లైఫ్ ఆన్ ఎర్త్ ( life on earth ) అనే ట్విట్టర్ అక్కౌంట్ లో పోస్ట్ అయిన ఈ చిన్న వీడియో ( Snake Video viral ) తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 95 వేల మంది ఈ వీడియోను చూసేశారు. మిగిలిన పాముల కంటే పూర్తి భిన్నంగా ఉందిది. నీలిరంగులో ఉండి..గులాబీతోటలోని ఓ గులాబీను చుట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. లేత నీలిరంగులో ఉన్న ఈ పాము పేరు బ్లూ పిట్ వైపర్ ( Blue pit viper ) . పైకి కన్పించేంత సాఫ్ట్ కాదట ఈ పాము. అత్యంత విషపూరితమైంది. మాస్కో జంతు శాల చెప్పిన దాని ప్రకారమైతే...ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావమై..ప్రాణం పోతుంది. సాధారణంగా ఈ పిట్ వైపర్ జాతి పాములు తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే ఉంటాయట. ఇలా నీలిరంగులో కన్పించడమనేది చాలా అరుదంటున్నారు. ప్రధానంగా ఈ తరహా పాములు ఇండోనేషియా ( indonesia ), తూర్పు తైమూర్ ప్రాంతాల్లో ఉంటాయి.
వీడియోనే కదా అని నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు ఈ పాముపై. ముద్దొస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. పొరపాటునో గ్రహపాటునో మీకెక్కడైనా తారసపడితే ముద్దు పెట్టే రిస్క్ చేయకండి మరి. Also read: Paytm APP: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ను తొలగించిన గూగుల్