Mayanti Langer: ఈ ఐపీఎల్‌లో ఆమె యాంకరింగ్ లేనట్టే.. ఎందుకంటే?

స్పోర్ట్స్‌ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకోవడంతోపాటు క్రీడాభిమానుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మయంతి లాంగర్ (Mayanti Langer). స్పోర్ట్స్ జర్నలిస్టుగా.. తనదైన స్టైల్లో యాంకరింగ్‌తో.. ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ (Stuart Binny ) సతిమణిగా లాంగర్ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. 

Last Updated : Sep 19, 2020, 02:22 PM IST
Mayanti Langer: ఈ ఐపీఎల్‌లో ఆమె యాంకరింగ్ లేనట్టే.. ఎందుకంటే?

Mayanti Langer, Stuart Binny blessed with a baby boy: స్పోర్ట్స్‌ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకోవడంతోపాటు క్రీడాభిమానుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మయంతి లాంగర్ (Mayanti Langer). స్పోర్ట్స్ జర్నలిస్టుగా.. తనదైన స్టైల్లో యాంకరింగ్‌తో.. ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ (Stuart Binny ) సతిమణిగా లాంగర్ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి మయంతి లాంగర్‌కు ఇంకా పాపులారిటీ పెరిగింది. మరికొన్నిగంటల్లో ఐపీఎల్ 2020 (IPL) 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఎప్పుడు ముందుగానే కనిపించి సందడి చేసే మయంతి లాంగర్ కనపడకపోవడంతో.. ఎందుకు ఆమె ఈ టోర్నీలో పాల్గొనడంలేదంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లాంగర్ ట్విట్టర్ వేదికగా ఈ సీజన్‌లో ఎందుకు పాల్గొనడంలేదో చెప్పారు. ఎందుకంటే మయంతి లాంగర్ నెల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త  ప్రముఖ క్రికెటర్‌ స్టువర్ట్‌​ బిన్నీతో కలసి బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. Also read: Yuvraj Singh: ఆ ఆరు సిక్సులకు 13 ఏళ్లు

భర్త, బిడ్డ ఫొటోను షేర్ చేయడంతో పాటు మయంతి లాంగర్ ఇలా రాశారు.. ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా.. కానీ ఇంట్లోనే ఉంటూ రోజువారి మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్‌ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్‌ సభ్యులైన జతిన్‌ సపారు, సుహైల్‌ చాందోక్‌, క్రికెట్‌ ఆకాశ్‌, సంజన గణేషన్‌, స్కాట్‌ బైరిస్‌, బ్రెట్‌ లీను మిస్సవుతున్నా.. అంటూ.. ట్విట్ చేశారు. గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్‌ తన కుటుంబంలో తనను ఒకదానిలా చూసుకుందని.. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్‌ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్‌ చేద్దామనుకున్నా. కానీ కరోనా ( Coronavirus) వల్ల అలా జరగలేదు.. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా.స్టువర్ట్‌ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తూ.. ఆస్వాదిస్తున్నా.. అంటూ లాంగర్ ట్విట్ చేశారు. Also read: MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!

స్పోర్ట్స్ జర్నలిస్టుగా.. మయంతి లాంగర్ ఐసీసీ (ICC) నిర్వహించే ప్రపంచకప్‌ టోర్నీలతో పాటు ఇండియన్‌ కౌన్సిల్‌ లీగ్ ‌(ICL‌), ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL), ఫిఫా (FIFA) లాంటి ఎన్నో టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు.  Also read: NIA Raids: 9మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

Trending News