కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మొబైల్ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయో ప్రజలకు వివరించి చెప్పేందుకు సరికొత్త బాటను ఎంచుకున్నారని కొందరు అంటున్నారు. ఇటీవలే శాసనసభ సమావేశాలకు వెళ్లేటప్పుడు జవదేకర్ ఒక సరికొత్త వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మొబైల్ ఫోన్‌ను చెవిలో పెట్టుకోకుండా.. హ్యాండ్ సెట్ రిసీవరుతో దానిని కనెక్ట్ చేసి.. అదే ఫోన్‌లో మాట్లాడడం ప్రారంభించారు.
అయితే రేడియేషన్ నుండి తనను కాపాడుకోవడానికి మాత్రమే ఆయన ఈ ప్రయత్నం చేశారని పలువురు తెలిపారు. జవదేకర్ తనను ఫోటోలు తీస్తున్న విలేకరులకు ఫోజులిస్తూనే వారితో మాట్లాడడానికి మాత్రం నిరాకరించారు. కేవలం నవ్వుతూ వారికి అభివాదం చేసి వెళ్లిపోయారు. అలాగే తాను ఎందుకు ఆ హ్యాండ్ సెట్ రిసీవరును తీసుకొచ్చారో కూడా ఎవరికీ చెప్పలేదు. ఎంతైనా రేడియేషన్ వల్ల కలిగే అనర్థాలను ఇలా ప్రజలకు చెప్పడానికి ప్రకాష్ జవదేకర్ చేసిన ప్రయత్నం అభినందనీయమని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Javadekar's fancy prop to prevent harmful cellphone radiation
Read @ANI story | https://t.co/03MUk8od0w pic.twitter.com/9eo3KsVu7H
— ANI Digital (@ani_digital) December 22, 2017