Land on Moon: సుశాంత్ ప్రేరణతో చంద్రునిపై భూమి కొనుగోలు చేసిన పాకిస్తాన్ నివాసి

కొనేవాడుంటే అమ్మేవాడు ఏదైనా అమ్మేస్తాడు. ఎంతవరకూ అధికారికమో తెలియదు గానీ భార్యకు పెళ్లికానుకగా సదరు వ్యక్తి చంద్రమండలం పై స్థలం కొని బహుమతి గా ఇచ్చాడు మరి. 

Last Updated : Sep 23, 2020, 06:22 PM IST
Land on Moon: సుశాంత్ ప్రేరణతో చంద్రునిపై భూమి కొనుగోలు చేసిన పాకిస్తాన్ నివాసి

కొనేవాడుంటే అమ్మేవాడు ఏదైనా అమ్మేస్తాడు. ఎంతవరకూ అధికారికమో తెలియదు గానీ భార్యకు పెళ్లికానుకగా సదరు వ్యక్తి చంద్రమండలం పై స్థలం కొని బహుమతి గా ఇచ్చాడు మరి. 

పెళ్లిరోజు కానుకగా లేదా పుట్టినరోజు కానుకగా భార్యకు స్థోమతను బట్టి బహుమతులిస్తుంటారు భర్తలు. కార్లు, ఆభరణాలు, విల్లాలు, పట్టుచీరలు ఇలా ఏదో ఒకటి. కానీ పాకిస్తాన్ ( Pakistan ) కు చెందిన ఆ వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. ప్రియమైన శ్రీమతి వెడ్డింగ్ డే గిఫ్ట్ గా చంద్రమండలం ( purchased land on moon ) పైనే ఎకరం స్థలం కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. 

పాకిస్తాన్ లోని రావల్పిండి ( Ravalpindi ) నివాసి సొహైబ్ అహ్మద్ ( Sohaib Ahmed ) తన భార్యకు పెళ్లిరోజు బహుమతిగా చంద్రుడిపై ఉన్న సీ ఆఫ్ వెపర్ ( Sea of weper ) ప్రాంతంలో ఎకరం స్థలం కొనుగోలు చేశాడు. ఇంటర్నేషనల్‌ లూనార్ ల్యాండ్‌ రిజిస్ట్రీ ( International lunar land registry ) వద్ద 45 డాలర్లకు ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు వ్యవహారం సంగతేమో గానీ ఇది ఎంతవరకూ అధికారికమో తెలియదు. కొనేవాడుంటే అమ్మేవాడు ఏదైనా అమ్మేస్తాడన్నట్టు జరుగుతోంది ప్రస్తుతం చంద్రమండలం పై భూముల కొనుగోలు వ్యవహారం. 

చంద్రమండలంపై ఈ ల్యాండ్ కొనుగోలు ప్రేరణ దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) అని చెబుతున్నాడు సొహైబ్. 2018లో ఇలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చంద్రమండలంపై సీ ఆఫ్ మస్కోవి అనే ప్రాంతంలో స్థలం కొన్నట్టుగా అందరికీ తెలుసు. అదే విధంగా హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులైన టామ్ క్రూజ్, షారూఖ్ ఖాన్ లకు కూడా చంద్రమండలంపై స్థలం ఉందట.

చంద్రమండలంపై తనకు స్థలముందని చెబితే ఎవరూ నమ్మలేదు సరికదా..జోక్ అని వదిలేశారట. ఆ భూమికి సంబంధించిన పేపర్లు చూసి నమ్మారట. అంతేకాదు ఇప్పుడు మరో స్నేహితుడు కూడా అతని భార్య కోసం చంద్రునిపై స్థలం కొనాలని నిర్ణయించుకున్నాడట. అమెరికా పోస్టల్ సర్వీస్ ద్వారా సొహైబ్ కు భూమి పత్రాలు లభించాయి. Also read: Bionic Eye: ప్రపంచంలోనే తొలిసారిగా..కంటిచూపు తిరిగి తెచ్చే ప్రయోగం

Trending News