CSK captain MS Dhoni IPL records: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ఐపిఎల్ రికార్డు వచ్చి చేరింది. శుక్రవారం రాత్రి దుబాయ్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SunRisers Hyderabad ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ( CSK vs SRH match ) ధోనీ ఓ అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే.. ఇప్పటివరకు ఐపిఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ నిలవడం విశేషం. ఇవాళ్టి మ్యాచ్‌కి ముందు వరకు ధోనీ ఐపిఎల్‌లో మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. తన మాజీ టీమ్‌మేట్ సురేష్ రైనా ( Suresh Raina ) ఆడిన ఐపిఎల్ మ్యాచ్‌లకు ఇది సమానం. కానీ ఈ రోజు ఆడిన మ్యాచ్ ధోనీ ఐపిఎల్ కెరీర్‌లో 194వ మ్యాచ్ కావడంతో ఇప్పటివరకు సురేష్ రైనా పేరిట ఉన్న అత్యధిక ఐపిఎల్ మ్యాచ్‌ల రికార్డును ధోనీ ( MS Dhoni breaks Suresh Raina's record ) అధిగమించేశాడన్న మాట. Also read : Kane Williamson in SRH vs CSK match: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కేన్ విలియమ్సన్ ఎందుకు ముఖ్యం ?
MS Dhoni today becomes the most capped player (194) in the history of IPL.#Dream11IPL pic.twitter.com/PwpDFcEA2E
— IndianPremierLeague (@IPL) October 2, 2020
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ తన రికార్డును బ్రేక్ చేయడంపై సురేష్ రైనా సైతం హర్షం వ్యక్తంచేశాడు. ధోనీ చేతిలో తన రికార్డు బద్దలవడం తనకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రైనా.. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలవాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ సీజన్ గెలుస్తుందని సురేష్ రైనా ధీమా వ్యక్తంచేశాడు. Also read : MS Dhoni, CSK vs DC match: చెన్నై బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కన్నెర్ర చేసిన ధోనీ
Congratulations Mahi bhai (@msdhoni) at becoming the most capped IPL player. Happiest that my record is being broken by you. All the best for the game today and am sure @ChennaiIPL will win this season’s @IPL. pic.twitter.com/f5BRQTJ0aF
— Suresh Raina🇮🇳 (@ImRaina) October 2, 2020
ఇక ఈ రికార్డులో ధోనీ, సురేష్ రైనా తర్వాత స్థానంలో 192 మ్యాచ్‌లతో ముంబై ఇండియన్స్ కెప్టేన్ రోహిత్ శర్మ ( Mumbai Indians captain Rohit Sharma ) ఉన్నాడు. Also read : MS Dhoni batting order: బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలకు ధోనీ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe