SRH vs CSK match interesting facts: ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయి స్టేడియం వేదికగా జరగనున్న నేడు శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టేన్సీలోని Chennai Super Kings, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని Sunrisers Hyderabad జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇంతకు ముందు వేర్వేరు జట్లతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచుల్లో ఓడిపోగా ఒక్కో మ్యాచులో మాత్రమే విజయం సాధించాయి. దీంతో ఈ రెండు జట్లకు కూడా నేడు జరగనున్న SRH vs CSK match మ్యాచ్‌లో విజయం ఎంతో అవసరం. Also read : Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్
ఐతే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) చివరి మ్యాచ్‌లో గెలిచిన జోష్‌తో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే.. చివరి రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచిన తీరాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వైఫల్యాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలవకపోతే.. ఓటమికి హ్యాట్రిక్ అవుతుంది. అన్నింటికిమించి పాయింట్స్ పట్టికలో మరింత దిగజారుతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచితీరాలనే కసిలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. Also read : IPL 2020: దూకుడు చూపిస్తాం అంటున్న చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SunRisers Hyderabad ) విషయానికొస్తే.. ఈ ఐపిఎల్ 2020 సీజన్ ఆరంభంలోనే తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి ఈ జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యాలే ఆ రెండు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాయి. కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner ), జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ) బాగానే ఆడినప్పటికీ.. 3వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మనీష్ పాండే ( Manish Pandey ) ఓపెనర్లకు అండగా నిలుస్తూ ఆటకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లోనే ఆటను బ్యాలెన్స్ చేసే ఆటగాళ్లు లేని లోటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వేధిస్తోంది.
ఐతే మూడోసారి ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపులో బ్యాటింగ్ పరంగా కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు.. 4వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కివీస్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ). ఈ మ్యాచ్‌లో జట్టుకి అందుబాటులో ఉన్న కేన్ విలియమ్సన్.. వచ్చీ రావడంతోనే మ్యాచ్‌ను తన బ్యాటింగ్‌తో బ్యాలెన్స్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కేన్ విలియమ్సన్ రాకతో మిడిల్ ఓవర్లలో ఆడే సరైన ఆటగాడు లేడనే లోటు కూడా కొంత తీరింది. టీ20 ఫార్మాట్‌లో మిడిల్ ఓవర్లకు సరిగ్గా సరిపోయే ఆటగాడు కేన్ విలియమ్సన్. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 26 బంతుల్లో అతడు రాబట్టిన 41 పరుగులు ఆ రోజు జట్టుకు ఓ మోస్తరు గౌరవప్రదమైన స్కోరుని అందించడమే కాకుండా గెలుపులోనూ కీలక పాత్ర పోషించాయి. Also read : Hardik Pandya: కేఎల్ రాహుల్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హార్దిక్ పాండ్యా
Kane Williamson aganist CSK.. కేన్ విలియమ్సన్ vs చెన్నై సూపర్ కింగ్స్ :
చెన్నై సూపర్ కింగ్స్‌పై విలియమ్సన్ పర్‌ఫార్మెన్స్‌ని విశ్లేషిస్తే.. 6 ఇన్నింగ్స్‌లో 143.29 స్ట్రైక్ రేట్‌తో 47 సగటుతో 235 పరుగులు చేసిన విలియమ్సన్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీలకం కానున్నాడు అంటున్నారు ఐపిఎల్ 2020ని నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ క్రికెటర్స్.
ఏదేమైనా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ మాత్రం ఢీ అంటే ఢీ అనేలా ఉండటం మాత్రం ఖాయమనే అంచనాలు ఐపిఎల్ అభిమానుల్లో ఉన్నాయి. వాస్తవంలో ఏం జరగనుందనేది మాత్రం మ్యాచ్ ఫలితం తేలితే కానీ చెప్పలేం. Also read : Jonny Bairstow: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఇంగ్లాండ్ షాక్.. కోట్లలో నష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe