KXIP vs CSK match ipl 2020: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2020లో ధోనీ సేన రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ధోనీ సేనకు ( Chennai Super Kings ) ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన 18వ మ్యాచ్‌లో Kings XI Punjab పై ఘన విజయం సాధించడం భారీ ఊరటనిచ్చింది. అది కూడా పంజాబ్ విధించిన 179 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ ( Shane Watson, Faf Du plessis ) కీలక పాత్ర పోషించారు. అందుకు కారణం కేవలం ఆ ఇద్దరి స్కోర్‌తోనే జట్టు విజయం సాధించడం. Also read : MI vs SRH IPL 2020 match: ముంబై ఇండియన్స్‌ని చేజ్ చేయలేకపోయిన సన్‌రైజర్స్
షేన్ వాట్సన్ 83 పరుగులు ( 4X11, 6X3), ఫాప్ డుప్లెసిస్ 87 పరుగులతో ( 4X11, 6X1) బ్యాటింగ్ ఇరగదీయడంతో మరొకరు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే జట్టును గెలిపించారు. 17.4 ఓవర్లలోనే 181 పరుగులు చేసి విజయం కోసం కసిగా ఎదురుచూస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఘన విజయాన్ని అందించారు. విచిత్రం ఏంటంటే.. వాట్సన్, డుప్లెసిస్ ఇద్దరు సరిసమానంగా చెరో 53 బంతులు ఆడి భారీ స్కోర్ సాధించడం. Also read : CSK vs SRH, IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ గెలుపు.. ధోనీకి మరో దెబ్బ!
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టేన్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) 63 పరుగులతో మరోసారి మంచి ప్రదర్శన కనబర్చాడు. నికోలస్ పూరన్ 33, మన్దీప్ సింగ్ 27, మయాంక్ అగర్వాల్ 26 పరుగులతో రాణించగా.. మాక్స్వెల్ 11, సర్ఫరాజ్ 14 పరుగులకే రనౌట్ అయ్యారు. Also read : Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్
KXIP vs CSK match ధోనీ ఖాతాలో 100 క్యాచ్‌ల 'సెంచరీ' రికార్డు :
ఇప్పటివరకు జరిగిన 13 సీజన్ల ఐపిఎల్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా ఉంటూ 100 క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా ( 100 catches as wicket keeper in IPL) మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇదివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కి ( KKR captain Dinesh Karthik ) మాత్రమే ఈ రికార్డు సాధ్యం కాగా.. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ డైవ్ చేసి మరీ పట్టుకోవడంతో ధోనీ సైతం ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe