Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్

అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ( MI vs KXIP match ) టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ( KL Rahul ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.

Last Updated : Oct 2, 2020, 01:32 AM IST
Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్

అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ( MI vs KXIP match ) టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ( KL Rahul ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) (70; 45 బంతుల్లో 8x4, 3x6), కీరన్ పోలార్డ్ ( Kieron pollard ) (47; 20 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య ( Hardik Pandya ) (30; 11 బంతుల్లో 3x4, 2x6) పరుగులతో రాణించారు. Also read : RR vs KKR, IPL 2020 : రాజస్తాన్‌ను రఫ్ఫాడించిన కోల్‌కతా నైట్ రైడర్స్

పొల్లార్డ్, హార్ధిక్ పాండ్య ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సుల వరద పారించి 23 బంతుల్లోనే 67 పరుగులు రాబట్టారు. క్రిష్ణప్ప గౌతం వేసిన మ్యాచ్ చివరి ఓవర్లో పొలార్డ్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో బంతిని చెండాడుకున్న పొలార్డ్ ఏకంగా 25 పరుగులు సాధించాడు. అంతిమంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల స్కోరు సాధించింది. Also read : RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ

192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన Kings XI punjab ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించే పరిస్థితి కనిపించ లేదు. ముంబై ఇండియన్స్ బౌలర్ల ( Mumbai Indians bowlers ప్రతిభ ఓవైపు.. కట్టుదిట్టమైన ఫీల్డింగ్ మరోవైపు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నికోలస్ పూరన్ ( Nikolas Pooran ) (44), మయాంక్ అగర్వాల్ ( Mayank Agarwal ) (25), క్రిష్ణప్ప గౌతం ( Krishnappa Gowtham ) (22), కేఎల్ రాహుల్ ( KL Rahul ) (17) మినహా మిగతా వాళ్లెవ్వరూ ఆ మాత్రం కూడా రాణించలేదు. ఫలితంగా 48 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఘోర పరాజయంపాలైంది. Also read : KKR vs SRH match: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News