Jani master video: జానీ మాస్టర్‌కు ఈ టాలెంట్ కూడా ఉందా ?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Choreographer Jani Master) పేరెత్తితే ఎవరికైనా ఆయన వేసే మాస్ స్టెప్పులే గుర్తుకొస్తాయి. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గానే ఆడియెన్స్ అందరికీ సుపరిచితుడు. డ్యాన్స్ అంటే కేక పుట్టించే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr) అయినా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అయినా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) అయినా.. ఇంకొకరైనా.. జానీ మాస్టర్ స్టెప్స్ అంటే ఇష్టపడతారు.

Last Updated : Oct 9, 2020, 05:33 AM IST
Jani master video: జానీ మాస్టర్‌కు ఈ టాలెంట్ కూడా ఉందా ?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Choreographer Jani Master) పేరెత్తితే ఎవరికైనా ఆయన వేసే మాస్ స్టెప్పులే గుర్తుకొస్తాయి. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గానే ఆడియెన్స్ అందరికీ సుపరిచితుడు. డ్యాన్స్ అంటే కేక పుట్టించే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr) అయినా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అయినా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) అయినా.. ఇంకొకరైనా.. జానీ మాస్టర్ స్టెప్స్ అంటే ఇష్టపడతారు. అటువంటి జానీ మాస్టర్‌లో ఒక కొరియోగ్రాఫర్ మాత్రమే కాకుండా మరో కళాకారుడు కూడా దాగున్నాడనే విషయం మీలో ఎంత మందికి తెలుసు ? ఇంతకీ జానీ మాస్టర్‌లో దాగున్న ఆ కళ ఏంటనే కదా మీ సందేహం. ఐతే మేం చెప్పడం కంటే ఇదిగో మీరే చూస్తేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. వీక్షించేయండి.

చూశారుగా జానీ మాస్టర్ పాట పాడటం. జీ తెలుగు నిర్వహిస్తున్న స రి గ మ ప ఐకాన్ కార్యక్రమంలోని ( Sa Re Ga Ma Pa ) లేటెస్ట్ ఎపిసోడ్‌కి అతిథిగా విచ్చేసిన జానీ మాస్టర్ అక్కడ పాడిన పాట ఇది. సాగర సంగమం సినిమాలోని థకిట తదిమి థకిట తదిమి పాటను ( Thakita Thadimi song ) అందంగా పాడి వినిపించడం చూసి అక్కడే జడ్జిగా కూర్చున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కోటి ( Koti ), ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఫిదా అయ్యారు. గాయకుడు అవాలని కోరుకున్నారా అని చంద్రబోస్ అడగ్గా.. అవును సర్ అని జానీ మాస్టర్ తెలిపారు. Also read : Mirzapur 2 trailer: నెం.1లో ట్రెండ్ అవుతోన్న సస్పెన్స్ థ్రిలర్ మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. అందులో జానీ మాస్టర్ సింగింగ్ స్కిల్స్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. జానీ మాస్టర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ చూడాలంటే అక్టోబర్ 9న ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే స రి గ మ ప కార్యక్రమం వీక్షించాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News