Health Tips: గుండెపోటు.. ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?

Heart Attack Golden Hour | గుండెపోటు వచ్చిన వారిని గంట తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఆ సమయంలోనే ఏదైనా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.

Last Updated : Oct 18, 2020, 09:41 AM IST
Health Tips: గుండెపోటు.. ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?

How to Prevent Heart Attack | మానవుడిలో అతి ప్రధానమైన భాగం గుండె. ఎందుకంటే ఇతర ఏ భాగం పనిచేయకున్నా మిగతా ఇతర అవయవాలు పనిచేస్తుంటాయి. కానీ గుండె విషయంలో అలా కాదు. గుండె ఆగిందంటే ప్రాణం పోయిందన్నట్లు. అందుకే గుండెపోటు (Heart Attack) వచ్చిందని ఎవరైనా చెబితే ఆందోళన చెందుతుంటాం. గుండెకు రక్తం సరఫరా ఆగిపోవడం, లేక రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం తలెత్తితే దాన్ని గుండెపోటు అని అంటారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో తెలియకపోవడం, కనీసం గంట  (Heart Attack Golden Hour) తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం వల్లే అధిక మరణాలు సంభవిస్తుంటాయి.

 

గుండెపోటు రాగానే అంత సమస్య ఉండదని, మొదటి గంట సమయం తర్వాతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అందుకే గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ (Golden Hour of Heart Attack) అంటారు. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. తొలి గంటలో గుండెకు రక్తం సరఫరా క్రమక్రమంగా ఆగిపోతుంది. అందుకే హాస్పిటల్‌కు చేరుకునే వరకు.. ముఖ్యంగా దగ్గడం, శ్వాస అధికంగా తీసుకోవడం లాంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ఛాతీలో నొప్పి వస్తే తేలికగా తీసుకోవద్దని డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత ఈసీజీ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీలో నొప్పి వస్తే జీర్ణ సమస్య, అసిడిటీ అని కొట్టి పారేయవద్దు. కుటుంబ పరంగా జన్యుపరమైన కారణాలతోనూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.  

 

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి (How to Prevent Heart Attack)

  • ప్రతిరోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయడం తప్పనిసరి
  • మధ్యపానానికి దూరంగా ఉండాలి
  • ధూమపానానికి సైతం దూరంగా ఉండటం ఉత్తమం
  • తగినంత నిద్ర పోవాలి. రాత్రి త్వరగా పడుకుని తెల్లవారుజామున నిద్రలేవాలి
  • ఒత్తిడిని పెంచే విషయాలను ఆలోచించడం మానేయాలి.
  • ఛాతీలో కాస్త నొప్పి అనిపించినా డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ టెస్టులు చేయించుకోవాలి 
  • ఆరోగ్యకర, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. 
  • కొవ్వును అదుపులో ఉంచుకోవాలి. చెడు కొవ్వుతో గుండెకు చేటు
  • నెగిటివ్ థింకింగ్ మానివేసి, వాస్తవాలు ఏంటన్నది తెలుసుకుని నడుచుకోవాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News