Navratri 2020 Deeksha | దేవీ నవరాత్రులు ( Navratri 2020 ) ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో అమ్మవారి భక్తులు అత్యంత పవిత్రతతో, నిర్మళమైన మనస్సుతో తల్లిని పూజిస్తారు. తమను కష్టాల కడలిని దాటించమని వేడుకుంటారు. అదే సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాస దీక్షను ( Navratri 2020 Fasting ) ప్రారంభిస్తారు.
నిష్టగా వ్రతం పాటిస్తారు. దీక్షతో మనసును అదుపు చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు పొరపాటున ఉపవాసం విడవడం, లేదా దీక్షకు భంగం వాటిల్లడం జరుగుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి అంటే...
- ఏరోజు అయితే మీరు పొరపాటు దీక్షను విడిచారో.. ఆ రోజు ఏదేవతను అయితే ప్రసన్నం చేసుకోవాలి అనుకొని దీక్ష చేపట్టారో ఆ దేవత ముందు తలవంచి క్షమాపణలు అడగాలి.
- అమ్మవారి పేరుపై ఇంట్లో వ్రతం చేయండి. మీ వ్రతం మధ్యలో భంగం వాటిల్లినందుకు తల్లికి క్షమాపణలు అడగండి. హోమం తరువాత నా వల్ల వ్రత భంగం వల్ల కలిగిన దోషాలను నివారించు తల్లి. నా వ్రతాన్ని పరిపూర్ణం చేయండి తల్లి అని వేడుకోండి
- ఈ దోషం నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ముందు ఏ దేవత వ్రతాన్ని అయితే మీరు భంగం కలిగించారో ఆ దేవత విగ్రహాన్ని తయారు చేయండి. అన్నింటికన్నా ముందు పాలు, పెరుగు, పంచదారను కలిపి పంచామృతంతో స్నానం చేయించండి.
- ఏ దేవత వ్రతాన్ని అయితే మీరు భంగం కలిగించారో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని పఠించండి. పూజ చేయండి.
- వ్రత భంగం జరిగిన తరువాత దగ్గరిలోని పండితుడిని కలిసి పరిష్కార మార్గాన్ని తెలుసుకొవడానికి ప్రయత్నించండి.
ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది?
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR