Apple India Online Store: ఐఫోన్ 12 ప్రి బుకింగ్స్ ప్రారంభం

Preorders For Apple iPhone 12 And iPhone 12 Pro | స్మార్ట్‌‌ఫోన్లలో తమదైన ముద్ర వేసిన బ్రాండ్ యాపిల్ కంపెనీ. టెక్ దిగ్గజం ఇటీవల తమ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్‌ను గత వారం ఆవిష్కరించింది. ప్రస్తుతానికి కేవలం రెండు మోడల్స్.. ఐఫోన్ 12,  ఐఫోన్ 12ప్రో మాత్రమే ప్రి బుకింగ్ సౌకర్యం (Apple India Online Store) అందుబాటులోకి తెచ్చారు.

Last Updated : Oct 23, 2020, 02:14 PM IST
Apple India Online Store: ఐఫోన్ 12 ప్రి బుకింగ్స్ ప్రారంభం

స్మార్ట్‌‌ఫోన్లలో తమదైన ముద్ర వేసిన బ్రాండ్ యాపిల్ కంపెనీ. టెక్ దిగ్గజం ఇటీవల తమ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్‌ను గత వారం ఆవిష్కరించింది. ఐఫోన్ 12 సిరీస్‌లో రాబోతున్న ఈ ఫోన్లకు అప్పుడే డిమాండ్ పెరిగింది. డిమాండ్ రావడంతో చెప్పిన సమయం కన్నా ముందుగానే ఐఫోన్12 ప్రి ఆర్డర్ బుకింగ్స్‌ను యాపిల్ ప్రారంభించింది. యాపిల్ ఐఫోన్ 12, యాపిల్ ఐఫోన్ 12ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్లు ప్రిఆర్డర్ బుకింగ్ చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 31 నుంచి ఈ ఐఫోన్ల కస్టమర్లకు డెలివరి కానున్నాయి.

ప్రస్తుతానికి కేవలం రెండు మోడల్స్.. ఐఫోన్ 12,  ఐఫోన్ 12ప్రో మాత్రమే ప్రీ ఆర్డర్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. (Apple iPhone 12 Price) ఐఫోన్ 12 ధర రూ. 79,900కు ప్రారంభం అవుతున్నాయి. (Apple iPhone 12 Pro Price) ఐఫోన్ 12ప్రో ప్రారంభ ధర ర.1,19,900గా ఉంది. ఈ రెండు మోడల్స్‌లో అన్ని రకాల కలర్ మొబైల్స్, అన్ని రకాల స్టోరేజీ వేరియంట్స్ యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ ఆర్డర్ చేసుకోవాలని ఆసక్తిగల వినియోగదారులకు కంపెనీ సూచించింది.

 

ఐఫోన్ 12 ధరలు
ఐఫోన్ 12లో 64 జీబీ వేరియంట్ ధర రూ. 79,900
ఐఫోన్ 12లో 128 జీబీ వేరియంట్ ధర రూ. 84,900
ఐఫోన్ 12లో 256 జీబీ వేరియంట్ ధర రూ.94,900

ఐఫోన్ 12 ఏ రంగుల్లో లభిస్తుంది?
Blue, Green, Black, White and RED colours

ఐఫోన్ 12ప్రో ధరలు
ఐఫోన్ 12ప్రో 128 జీబీ ప్రారంభ ధర రూ.1,19,900
ఐఫోన్ 12ప్రో 256 జీబీ ధర రూ.1,29,900
ఐఫోన్ 12ప్రో 512 జీబీ ధర రూ.1,49,900

ఐఫోన్ 12ప్రో ఏ రంగుల్లో లభిస్తుంది?
Pacific Blue, Graphite, Silver and Gold colours 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News