Samsung Chairman Lee Kun Hee Dies | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం, శాంసంగ్ సంస్థ చైర్మన్ లీ కున్ హీ (78) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన లీ కున్ హీ ఆదివారం తుదిశ్వాస విడిచారని (Lee Kun Hee Passed Away), ఇది చాలా బాధాకరమని శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లీ కున్ హీ ఆలోచన, ఆవిష్కరణలతో, ఆయన మార్గదర్శకత్వంలో శాంసంగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయాలు జరిగిన స్మార్ట్‌ఫోన్ కంపెనీగా రూపాంతరం చెందింది.
2014లో తొలిసారిగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ హీకి గుండెపోటు వచ్చింది. ఇక అప్పటినుంచి గుండె సంబంధిత అనారోగ్యంతో ఆయన సతమతమవుతున్నారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కంపెనీని ప్రపంచ స్థాయిలో దూసుకెళ్లేలా చేసిన ఘనత లీ కున్ హీ సొంతం అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు, మెమరీ చిప్‌లు తయారుచేస్తున్న కంపెనీగా శాంసంగ్‌ను ఆయన తీర్చిదిద్దారు.
కాగా, లీ కున్ హీ 1942 జనవరి 9న జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగిన లీ కున్, శాంసంగ్ కంపెనీ చైర్మన్ పదవి చేపట్టాక వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 1987లో తొలిసారి శాంసంగ్ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2010లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్‌గా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో అనారోగ్యంతో నేడు (అక్టోబర్ 25న) కన్నుమూశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe