Raveena Tandon Birthday: KGF 2 పవర్‌ఫుల్ లుక్ రిలీజ్

కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం.. సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ‘కేజీఎఫ్‌’ పీరియాడిక‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని పెంచి.. టోటల్ సినీ ఇండస్ట్రీనే (cine industry in india) షేక్ చేశారు.

Last Updated : Oct 26, 2020, 12:18 PM IST
Raveena Tandon Birthday: KGF 2 పవర్‌ఫుల్ లుక్ రిలీజ్

KGF team revealed Raveena Tandon look: కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం.. సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ‘కేజీఎఫ్‌’ (KGF) పీరియాడిక‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని పెంచి.. టోటల్ సినీ ఇండస్ట్రీనే (cine industry in india) షేక్ చేశారు. ఈ సినిమాలో నటించిన హీరో యశ్ (Yash) తన నటనతో పాన్ ఇండియా స్టార్‌గా మారి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమాకు సిక్వేల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. Also read; KGF Chapter 2: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

అయితే ఇటీవలనే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ (Sanjay Dutt) నటిస్తున్న అధీరా లుక్.. దీంతోపాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty ) లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ ( Raveena Tandon) (46) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. కేజీఎఫ్ 2 సినిమాలో ఆమె చేస్తున్న రమికా సేన్ పవర్‌ఫుల్ పాత్ర లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు సోమవారం ట్విట్ చేశాడు. ‘క్రూరత్వానికి అధినేత్రి, పవర్‌ హౌస్‌ రమికా సేన్‌'కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. రవీనా టాండన్‌ లుక్‌ను ట్విట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. Also read: Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

ఇదిలాఉంటే.. పాన్ ఇండియా మూవీగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. దీనికోసం చిత్ర యూనిట్ వేగంగా షూటింగ్ నిర్వహిస్తోంది.

HBD Srinidhi Shetty: ప్రేమా, క్రూరత్వం కలిసి ఉండగలవా ? కేజీఎఫ్ హీరోయిన్ పుట్టిన రోజున దర్శకుడి ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News