నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకురాలు కవితతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
కాగా, ఇటీవల జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అభ్యర్థి కవిత ఘన విజయం (Kavitha wins in MLC Election) సాధించడం తెలిసిందే. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితం తొలి రౌండ్‌లోనే తేలిపోయింది. సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా మాజీ ఎంపీ కవిత భారీ మెజార్టీతో విజయం సాధించారు. అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలో 823 ఓట్లు ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఎమ్మెల్సీగా @RaoKavitha ప్రమాణస్వీకారం
మండలిలో కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు#KalvakuntlaKavitha #kavitha pic.twitter.com/pHAUNPFPmP
— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) October 29, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Kavitha: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం