Gunasekhar about Shakuntalam movie: కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి ( Rana Daggubati ) నటిస్తోన్న 'హిరణ్యకశ్యప' సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కనీసం 6 నుండి 8 నెలల వరకు పడుతుందని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. అందుకే మహాభారతంలోని ఆదిపర్వం నుండి ఇతిహాస కథ అయిన 'శాకుంతలం' సినిమాను ( Shakuntalam movie ) ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. శకుంతల పాత్రను పోషించడానికి ఆ పాత్రకు తగ్గట్టుగా ఒక అందమైన హీరోయిన్ని వెతికే పనిలో ఉన్నారు డైరెక్టర్ గుణశేఖర్. Also read : Jr NTR request to Rajamouli: రాజమౌళికి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్
తాజాగా శాకుంతలం సినిమా ప్రత్యేకతను, గొప్పతనాన్ని గురించి గుణశేఖర్ ట్విట్టర్లో వెల్లడించారు. కాళిదాస్ రాసిన ఈ 'శాకుంతలం' అనే పురాణ కథ విదేశీ భాషలలోకి అనువదించబడిన మొట్ట మొదటి భారతీయ కథ. విలియం జోన్స్ దీనిని 1789లోనే ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. ఆ తరువాత దీనిని 1889 సంవత్సరంలో నార్వేజియన్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి 46 విదేశీ భాషలలోకి అనువదించారు.
A whimsical tale of love #Shaakuntalam beckoning ♥️
Writer & Director : @Gunasekhar1 Music by: #Manisharma pic.twitter.com/p36L3RMPok— Gunaa Teamworks (@GunaaTeamworks) October 30, 2020
విశ్వామిత్ర మహర్షి, అప్సర మేనక దంపతుల ( Vishwamitra and Apsara Menaka ) కుమార్తె శకుంతల కథ గురించే ఈ శాకుంతలం సినిమా అని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. గుణశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ''ఎఫైర్, రహస్యంగా చేసుకున్న పెళ్లి, దుష్యంత్‌తో ( Shaakuntala and Dushyant love story ) ప్రేమాయణం వంటి ఎన్నో ఆసక్తికరమైన సీక్వెన్స్‌ల సమాహారమే శాకుంతలం మూవీ కథాంశంగా ఉండబోతోంది అని తెలుస్తోంది. Also read : Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్