అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా సోమవారం రాత్రి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( DC vs RCB match ) జట్ల మధ్య జరిగిన 55వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్‌లో ( IPL 2020 playoffs ) బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తమ విజయాన్ని 19 ఓవర్ల వరకు లాక్కొచ్చిన క్రమంలో పాయింట్స్ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. Also read : PV Sindhu: పీవీ సింధుపై నెటిజెన్స్ సెటైర్స్
153 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 54 పరుగులు: 41 బంతుల్లో 6 ఫోర్లు), అజింక్య రహానె ( Ajinkya Rahane 60 పరుగులు: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 6 వికెట్ల తేడాతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed ) 2/26 తో రాణించగా.. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. Also read : Shane Watson retirement: క్రికెట్‌కు షేన్ వాట్సన్ గుడ్ బై ?
బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో దేవదత్ పడిక్కల్ ( Devdutt Padikkal 50 పరుగులు: 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించగా.. ఆ తర్వాత ఏబి డివిలియర్స్ ( AB de villiers 35), విరాట్ కోహ్లీ ( Virat Kohli 29) చేయగా శివం దూబే ( 17), ఓపెనర్ జోష్ ఫిలిప్పె (12) పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జె ( Anrich Nortej ) 3/33 తో బెంగళూరు ఆటగాళ్లను కట్టడి చేయగా.. కగిసో రబాడ 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. Also read : Reasons behind CSK defeat: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలు
ప్రస్తుతం పాయింట్స్ పరంగా 18 పాయింట్స్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) తొలి స్థానంలో ఉండగా 16 పాయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, 14 పాయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe