Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

బాలీవుడ్‌ (Bollywood)కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్‌ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు.

Last Updated : Nov 13, 2020, 07:09 AM IST
Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

Actor Asif Basra dies by suicide: న్యూఢిల్లీ: బాలీవుడ్‌ (Bollywood) కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్‌ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల మెక్‌లియోడ్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఆసిఫ్ బాస్రా.. మహారాష్ట్ర ( Maharashtra ) లోని అమరావతికి చెందినవారు. కొంతకాలం నుంచి ఆయన ధర్మశాల (Himachal Pradesh's Dharamshala)లో నివాసముంటున్నారు. 

అయితే ఆసిఫ్ బాస్రా చాలా సూపర్ డూపర్ హిట్ చిత్రాలల్లో నటించారు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'జబ్ వి మెట్', 'కై పో చే', 'బ్లాక్ ఫ్రైడే', 'క్రిష్ 3', 'ఏక్ విలన్', 'ఫ్రీకీ అలీ' 'హిచ్కి' తదితర చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా హాలివుడ్ చిత్రం 'పర్జానియా'లో నటించి ఆయన విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. దీంతోపాటు ఆయన 'వన్ నైట్ విత్ ది కింగ్', ఔట్‌సోర్స్డ్‌డ్'లో కూడా నటించారు. పాతాళ్‌ లోక్‌ లాంటి వెబ్‌సీరిస్‌లోనూ నటించి బాస్రా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కొద్దికాలం కిందట ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలిసి ఆసిఫ్‌ ‘కై పో చే’ సినిమాలో నటించారు. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

ఇదిలాఉంటే.. బాలీవుడ్‌లో వరుస ఆత్మహత్యలపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫ్ బాస్రా ఆత్మహత్య పట్ల నమ్మలేకపోతున్నామంటూ పలువురు సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. 

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News