కె.చంద్రశేఖర్ రావు జీవన ప్రస్థానం....

Last Updated : Aug 24, 2017, 01:34 PM IST
కె.చంద్రశేఖర్ రావు జీవన ప్రస్థానం....

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీ నుంచి వేరుపడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. అందరు ఈయన్ను కేసీఆర్ గా గుర్తిస్తారు. ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సాధన కర్తగా.. తెలంగాణ గాంధీగా ఆయన పిలవబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్తానం గురించి తెలుసుకుందాం...

జీవిత విశేషాలు...

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్శిటీలో ఎం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన భార్య శ్రీమతి శోభా. కేసీఆర్ దంపతులకు  ఒక కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. 

పొలిటికల్ కెరీర్...

విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1999-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రల్ 27 న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు.

2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు.  14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్ సభ సభ్యులన్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యు.పి.ఏ. కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది.

లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు.2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 50 వేల పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు.

2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ఈ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ ఆకస్మిక మతి చెందడం ..కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణమానాలను తనకు అనుకూలంగా మరల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉధతం చేసి..  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కేసీఆర్ సృష్టించిన వాతావరణంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం..2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x