కరుణానిధితో రజినీకాంత్ భేటీ

రాజకీయాల్లో రంగప్రవేశం చేశాక.. రజినీ తొలిసారిగా బయటకు వచ్చారు. చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.

Last Updated : Jan 8, 2018, 01:24 PM IST
కరుణానిధితో రజినీకాంత్ భేటీ

రాజకీయాల్లో రంగప్రవేశం చేశాక.. రజినీ తొలిసారిగా బయటకు వచ్చారు. చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఈ సమావేశం 10 నిమిషాలకుపైగా జరిగింది. ఈ భేటీలో కరుణానిధి కుమారుడు, డీఎంకే కోశాధికారి స్టాలిన్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం రజినీకాంత్ ఇంటిబయట మీడియాతో మాట్లాడుతూ- " ఆయన దేశరాజకీయాల్లో సీనియర్ రాజకీయ వేత్త. నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయనకు, నాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ ప్రవేశం తరువాత ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నేను ఆయనను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

తమిళనాడులో ద్రావిడ పార్టీని నిర్వీర్యం చేసేందుకు రజినీ ప్రయత్నిస్తున్నాడని కొందరు అంటున్నారని.. అది జరగదని డిఎంకే కోశాధికారి స్టాలిన్ అన్నారు. ఎన్నికల్లో మీరు రజినీకాంత్‌కు మద్దతు ఇస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్నికల సమయంలో చూద్దాం అని సమాధానం దాటవేశారు.

 

Trending News