కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడైన అహ్మద్ పటేల్ ( 71 ) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన నెల రోజుల్నించి చికిత్స తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేతను కోల్పోయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు గడించిన అహ్మద్ పటేల్ ( Ahmed patel demisal ) మరణించారు. నెల రోజుల క్రితం కరోనా ( Corona virus ) బారిన పడిన అహ్మద్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అతని కుమారు ఫైజల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన కరోనా బారిన పడినట్టు అహ్మద్ పటేల్ స్వయంగా వెల్లడించారు. అహ్మద్ పటేల్ మరణించడం పార్టీకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.
Senior Congress leader Ahmed Patel passes away, tweets his son Faisal Patel. pic.twitter.com/4QgyLxvPis
— ANI (@ANI) November 24, 2020
Also read: RTGS అంటే ఏంటి ? డిసెంబర్ నుంచి మారనున్న అంశాలేంటి ?