కీలకమైన అంశాలపై ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకు ఆమోదం లభించింది. పలు ఇతర పధకాల్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys Jagan Government ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25వ తేదీన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. దీంతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైఎస్సార్ గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం 105 ఎెకరాల భూ సేకరణ, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకాలకు కేబినెట్ ( Ap Cabinet ) ఆమోదం తెలిపింది. మరోవైపు ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిలుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నివర్ సైక్లోన్ ప్రభావంపై కూడా కేబినెట్ లో చర్చించామని మంత్రి కన్నబాబు ( Ap minister kannababu ) తెలిపారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 13 వందల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని...వాటికి డిసెంబర్ 30 లోగా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. నివర్ సైక్లోన్ ( Nivar Cyclone ) సందర్బంగా దాదాపు 10వేల మందిని సహాయక శిబిరాలకు తరలించామని తెలిపారు. ఉద్యోగులు, పింఛన్ దారుల డీఏ బకాయిల్ని చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. డీఏ పెంపుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోతను డిసెంబర్, జనవరి నాటిికి తిరిగి చెల్లిస్తామన్నారు.
డిసెంబర్ 2 నుంచి ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో 9 వేల 889 బల్క్ చిల్లింగ్ యూనిట్ల అభివృద్ధికి నిర్ణయించామన్నారు. Also read: AP: మూడు రాజధానుల పరిష్కారానికి జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా