భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కరోనా వ్యాక్సిన్ డీల్ కుదిరింది. దేశంలోని రెండు కంపెనీలతో ..ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య ఒప్పందమైంది. మూడు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేసేందుకు ఇండియా అంగీకరించింది.
ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca )లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌తో ( Corona vaccine ) ఉత్పత్తి, పంపిణీ ఒప్పందం కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of India )తో మరో భారీ ఒప్పందం జరిగింది. ఈ వ్యాక్సిన్ 3 కోట్ల డోసుల్ని సరఫరా చేసేందుకు భారత్- బంగ్లాదేశ్ దేశాల మధ్య ఒప్పందమైంది. ఈ ఒప్పందం ప్రకారం సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీ 3 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పొరుగు దేశాలకు సహాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు.
బంగ్లాదేశ్ ( Bangladesh )లోని భారత హై కమీషనర్ విక్రమ్ దొరైస్వామి కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ట్వీట్ కూడా చేశారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొందిన తరువాత మొదటి దశలో 3 కోట్ల డోసుల్ని మాకు అందించేలా ఒప్పందం ఢాకాలో కుదుర్చుకున్నామని బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ జాహిద్ మాలిక్ తెలిపారు. ఇండియాలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ఐదింట..నాలుగు వ్యాక్సిన్లు రెండు, మూడు దశల్లోనూ, ఒక వ్యాక్సిన్ మాత్రం 1,2 దశల్లోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్, ఖతార్, భూటాన్, స్విట్జర్లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాలు మన దేశపు వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని భావిస్తున్నాయి. Also read: Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి